చంద్రబాబు సంచలన నిర్ణయం ..బోయపాటి శ్రీనుకు కీలక బాధ్యతలు..!

సింహం ఎప్పుడైనా సింహమే అని ప్రూవ్ చేశాడు చంద్రబాబు నాయుడు . చంద్రబాబు నాయుడుకి ఎంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రూపు రేఖలను మార్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది . ఆ విషయం ఎంతోమంది ఓపెన్ గానే ఒప్పుకున్నారు . అలాంటి చంద్రబాబు నాయుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు . అంతేకాదు అసెంబ్లీలో శ్పధం కూడా చేశారు . కొంతమంది ఆయనను జైలుకు కూడా పంపించారు . ఎన్నో భారీ అవమానాలు కూడా ఎదుర్కొన్నారు .

ఫైనల్లీ ఓర్పు సహనంతో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయిపోయింది. భారీ మెజారిటీతో సీఎం గా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం ఉత్సవానికి కావాల్సిన పనులను ముందునే పక్కాగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏ విధంగా ఉండాలి..? ఎవరెవరిని పిలవాలి..? స్టేజ్ డిజైనింగ్ ఎలా ఉండాలి..? అనే విషయాలన్నీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న బోయపాటి శ్రీనుకు అప్పజెప్పారట .

ఆయనకు కీలక బాధ్యతలు కూడా ఇచ్చారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . బాలకృష్ణ – బోయపాటి శ్రీను ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడుకు కూడా బోయపాటి శ్రీను బాగా క్లోజ్ .. చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మూమెంట్లో బోయపాటి శ్రీనుకి ఇంత పెద్ద బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది..!!