ఎడ్యుకేట్‌ చేస్తున్న వెంకయ్య.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]

కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]

పవన్‌కి బీజేపీ రంగు తెలిసొస్తోంది.

పవన్‌కళ్యాణ్‌కి బిజెపి అసలు రంగు కనిపిస్తోంది. ఆ రంగుల్ని స్వయానా బీజేపీ నాయకులే చూపిస్తున్నారు. తిరుపతి బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ తమను విమర్శించినా, సరిపెట్టుకున్న బిజెపి నేతలు, ఈసారి కాకినాడలో చేసిన విమర్శల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్నే విమర్శిస్తావా? నీ రాజకీయ అనుభవం ఏంటి? అని వారు ప్రశ్నిస్తోంటే, పవన్‌కళ్యాణ్‌తోపాటు ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. బిజెపి నాయకుడు ఆంజనేయరెడ్డి అయితే ఎప్పుడో పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి రాకముందు స్థాపించిన సిఎంపిఎఫ్‌ (కామన్‌ మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) ఏమయ్యింది? […]

చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]

ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

ఆ కాశ్మీర్‌ని తీసుకొస్తే మోడీ ధన్యుడే

పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలోకి తీసుకురావాలనే మహా సంకల్పంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిపెట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నరేంద్రమోడీ చర్చించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆ భూభాగం, పాకిస్తాన్‌ ఆధీనంలో ఉంది. అక్కడ పాకిస్తాన్‌ సైన్యాలు యధేచ్ఛగా తిరుగుతాయి. అక్కడి ప్రజల్ని నాశనం చేస్తుంటాయి. అక్కడే తీవ్రవాదుల స్థావరాల్ని నెలకొల్పుతుంటాయి. కానీ అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో సంబందం లేని ప్రాంతంగానే చూపుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌ […]

ట్విట్టర్ లో షాక్ ఇచ్చిన సుష్మా స్వరాజ్

ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ ముస్లిం జంటను కలపడంలో ఆమె సహకరించడం .. ఇవన్నీ చూసి ఓ కుర్రాడికి ఆమెను టీజ్ చెయ్యాలనిపించింది.. అంతే.. “నా కొత్త కారు పాడయిపోయింది, పొగ వస్తోంది, షాపు తీసికెళితే వాడు రీప్లేస్ చేయనంటున్నాడు.. నన్నేం చేయమంటారు, మీరో మాట చెబితే నాకు […]

సివిల్స్ టెస్ట్ లో మోడీ జపం

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ ప‌రీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల‌కు నిజ‌మైన ప‌రీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించే 13 కావ‌డం గ‌మ‌నార్హం. ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, స్టాండ‌ప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజ‌న‌, స్ట‌డీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫ‌ర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్‌, ప్రధాన‌మంత్రి ముద్రా యోజ‌న‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ల‌పై ప్రశ్నలు అడిగారు. వీటిపై చాలామంది అభ్యర్థులు మండిప‌డుతున్నారు. ఆధునిక చ‌రిత్ర‌, […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]