ఏపీ రాజ‌ధానిలో టీడీపీతో బీజేపీ క‌టిఫ్‌

2014 నుంచి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మ‌ధ్య రానురాను కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేకత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల కాలంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక‌, ఇప్పుడు ఇదే నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం విష‌యంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింతగా కారాలు మిరియాలు నూర‌డంతోపాటు అస‌లు టీడీపీతోనే క‌టీఫ్ చెప్పేందుకు […]

యూపీ ఎన్నిక‌ల‌పై స‌ర్వే సిత్రాలు సూడ‌రో!

వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(యూపీ) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు చేస్తున్న స‌ర్వేలు, వెల్ల‌డిస్తున్న ఫ‌లితాలు హాట్‌హాట్‌గా ఉంటున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వేడెక్కిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒక‌టి, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా అదిపెద్ద‌ది అయిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లంటే… ఆ ఒక్క రాష్ట్ర‌మే కాదు.. దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇక్క‌డ ఎంపీ స్థానాలు కూడా ఎక్క‌వే. కాబ‌ట్టి ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చే పార్టీకి త‌దుప‌రి జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో […]

టీడీపీ కంచుకోట‌లో అసంతృప్తి సెగ‌లు

ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందించిన జిల్లాల్లో ఒక‌టైన అనంత‌పురం గ‌త ఎన్‌టీఆర్‌ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోట‌గా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ స‌హా ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌లు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉర‌వ‌కొండ‌, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్ల‌నూ టీడీపీనే కైవ‌సం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్య‌ధిక బ‌లం […]

ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్‌.

విభ‌జ‌న పాపంలో పార్ల‌మెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీతో పోటీప‌డి మ‌రీ బీజేపీ పాలు పంచుకున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మ‌ర‌చిపోలేదు. అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటామ‌ని చెప్పిన‌ బీజేపీ నేత‌ల హామీల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఫ‌లితంగానే ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఉన్న కాంగ్ర‌స్ పార్టీని చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మ‌రీ టీడీపీ, బీజేపీ కూట‌మికి అధికారం అప్ప‌గించారు.. అయితే  అధికారం చేజిక్కాక, […]

టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]

ప్యాకేజీతో రాజకీయ సమాధి.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని […]

ప‌వ‌న్‌తో బీజేపీ రాజీ యత్నాలు

హోదా ప్ర‌క‌టించనందుకు ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో దూర‌మవుతున్న‌ మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. ముఖ్యంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తీవ్ర స్వ‌రంతో బీజేపీపై విరుచుకుప‌డుతున్నాడు. ద‌శ‌ల వారీ పోరాటానికి కార్యాచ‌ర‌ణ కూడా ప్ర‌క‌టించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భ‌విష్య‌త్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే ప‌వ‌న్‌ రంగంలోకి దిగ‌కుండా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జ‌న‌సేనానితో రాయ‌బారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]

వెంక‌య్యా ఈ కుప్పి గంతులేంద‌య్యా..

`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామ‌ప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! `ఆకాశంలో స్కామ్‌, నీటిలో స్కామ్‌, గాలిలో స్కామ్ ఇలా వారి హ‌యాంలో అన్నింటిలోనూ స్కామ్‌లే` అని కాంగ్రెస్‌ను ఏకిపారేయాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే!! ప్రాస‌లు, పంచ్‌లు.. మాట‌ల తూటాల‌తో దాడి చేస్తారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని రాజ్య‌స‌భ‌లో పోరాడిన ఆయ‌నే ప్యాకేజీతో ఏపీకి లాభ‌మ‌ని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయ‌ని ప్లేట్ ఫిరాయించారు! విశాఖ‌కు రైల్వే జోన్ వ‌చ్చేలా కృషిచేస్తాన‌ని […]

మోడీ పొగిడారు, అమిత్‌ షా విమర్శించారు.

రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్‌ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్‌ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్‌ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]