ఆయ‌న‌తో ప‌వ‌న్ భేటీ సీక్రెట్ ఇదేనా..!

భ‌విష్య‌త్తు ఏపీ రాజ‌కీయాలు మంచి ర‌స‌వత్త‌రంగా ఉండ‌బోతున్నాయ‌ని చెప్పేందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్ర‌న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ బ‌రిలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటూ ఉండ‌టం ఒక‌టైతే.. ఇక విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ టీడీపీకి ప్ర‌త్యామ్నాయం త‌న పార్టీయేన‌ని చాటేందుకు.. పాద‌యాత్ర‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు మ‌రో ముఖ్యాంశం. నిజానికిప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప‌క్క ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో… త‌న సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాల‌ను […]

నరుడా డొనరుడా TJ రివ్యూ

సినిమా : నరుడా డోనరుడా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మొలకెత్తని విత్తనం తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ సంగీతం : శ్రీ చరణ్ నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట దర్శకత్వం : మల్లిక్ రామ్ బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్ మాటలు : సాగర్ రాచకొండ,కిట్టు రీమేక్ సినిమాలు తీయడం శానా వీజీనే కానీ వాళ్ళ వాళ్ళ నేటివిటికీ తగ్గట్టుగా మార్పులు ..చేర్పులు చేయకపోతే చేతులు […]

ప‌వ‌న్ సేఫ్ గేమ్ వైపే మొగ్గు…!

ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో అంత‌కుముందు అడ‌పా ద‌డ‌పా కొంగ‌ర జ‌గ్గ‌య్య వంటి న‌టులు రాజ‌కీయాలవైపు ఒకో అడుగు వేసినా… 1980 వ‌ద‌శ‌కం మొద‌ట్లో విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ఆరంగేట్రం త‌రువాత‌నే పూర్తి స్థాయిలో సినీ న‌టుల హ‌వా మొద‌లైంద‌ని చెప్పాలి. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌నే స‌మూలంగా మార్చేసిన ప‌రిణామం… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇక ఆనాటినుంచి ఏపీ రాజ‌కీయాల్లో సినీ న‌టుల పాత్ర‌లేని పార్టీలే లేవంటే అతిశ‌యోక్తి లేదేమో. ఎన్టీఆర్ యుగం అనంత‌రం… సినిమాల్లోంచి.. సొంత పార్టీ […]

మాజీ మంత్రికి కొత్త పార్టీలే గ‌తా..!

ఎంతీ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌కైనా ఒక్కొక్క సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో కొంత వారి స్వ‌యంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు త‌న స్టైల్లో చ‌క్రం తిప్పిన కొణ‌తాల వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు. అన‌కాప‌ల్లి నుంచి క్రియా శీల రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన కొణ‌తాల త‌ర్వాత త‌న ప్ర‌భావం చూపించేందుకుఎంతో […]

ములాయం మ‌హాకూట‌మిపై మ‌ళ్లీ లుక‌లుక‌లు

యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్ర‌ధాని కావాల‌నే ముచ్చ‌ట ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, వ‌చ్చే 2017 రాష్ట్ర ఎన్నిక‌ల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ఆయ‌న ఆశ‌ల‌పై నా నీళ్లు జ‌ల్లుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఈ రెండు విష‌యాల్లోనూ ఆయ‌న క్లారిటీగానే ఉన్నా.. ఆయ‌న భాగ‌స్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్ల‌కు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నారు. వాస్త‌వానికి ఎస్పీ విష‌యంలో ములాయం మాటే వేదం! అయితే, […]

ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్‌

ఏపీ మంత్రుల్లో కొంద‌రి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయ‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టికి మొన్న విశాఖ అవ‌స‌రాల‌కు స్థ‌లాలు కేటాయించేందుకు స‌సేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింన‌గ‌ర్ సొసైటీకి విశాఖ‌లో స్థ‌లాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవ‌లం త‌న కుమారుడి టాలీవుడ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంటా ఇలా చేశార‌ని టాక్ వ‌చ్చింది. […]

చంద్ర‌బాబు ఫ్రెండ్ అప్పుల అప్పారావ్ అయ్యాడా..!

స‌రిగ్గా  ద‌శాబ్ద కాలం క్రితం… భ‌విష్య‌త్తు మీద ఎన్నో ఆశ‌ల‌తో  మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌పై  పోటీప‌డి మ‌రీ.. దూకుడుగా పెట్టుబ‌డులు కుమ్మ‌రించిన ఇన్‌ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్న‌ట్టు లేక‌పోవ‌డంతో ఇప్పుడు పీక‌ల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిందేమిటంటే ఈ ఇన్‌ఫ్రా మేజ‌ర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్యాపార వేత్త‌ల‌వే. వీరిలో కావూరి సాంబశివరావు , ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌,  నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్ర‌స్తుతం బ్యాంకుల […]

అప్పుడే జ‌న‌సేన మూట ముల్లు స‌ర్దేసిందా..!

సినీ న‌టుడిగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే… మ‌రోప‌క్క పూర్తిస్థాయి రాజ‌కీయ‌వేత్త‌గానూ అవ‌తార‌మెత్తేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పశ్చిమ‌గోదావ‌రిని త‌న రాజ‌కీయాల‌కు కేంద్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు త‌ర‌లి రావాల‌న్న‌ ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంతో రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌ను , సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. […]

టీడీపీలో ఒక్క‌టైన బ‌ద్ధ శ‌త్రువులు

క‌డ‌ప జిల్లాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లుగా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్క‌డ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌..ఆదినారాయణరెడ్డి,  మొద‌టినుంచి టీడీపీనే న‌మ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ లోకి రావ‌డాన్ని… రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌మో… లేక ఈ  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు వ్యూహ చ‌తుర‌తో తెలియ‌దుగానీ విప‌క్ష అధినేత జగ‌న్ సొంత‌ జిల్లాలో ప‌రిణామాలు […]