తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం […]
Author: admin
’ఇంద్రవెల్లి‘ సభ గులాబీలో గుబులు పుట్టించిందా..?
రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు తిడుతుంటే కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తమ పార్టీకి పూర్వపు రోజులు వచ్చేశాయని హుషారుగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపితే గులాబీ పార్టీలో గుబులు రేపిందనే చెప్పవచ్చు. అరె.. ఇదేంది రేవంత్ సభకు ఇంత జనం వచ్చారు.. అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు […]
హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ
’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ […]
నిపుణులు వారు కాదు.. వీరు అసలైన నిపుణులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. అరె.. అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. అవకాశముంటే చేసేస్తాం అన్నట్టుంది వైసీపీ తీరు. కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర నిపుణులుగా సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారిని తొలగించి వైసీపీ సభ్యులకు చోటు కల్పించింది ప్రభుత్వం. వారిని తొలగించడానికి కూడా ఓ కారణం చెప్పింది. గతంలో నియమితులైన ముగ్గురు సభ్యులకు నైపుణ్యం లేదు.. వారు నిపుణులు కాదు.. అందుకే వారి స్థానంలో వీరిని […]
నిధుల వేటలో ఏపీ సర్కార్ కొత్త అడుగు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. ఎవరూ డబ్బులిచ్చే పరిస్థితి లేదు.. సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయలను జగన్ సర్కారు కేటాయిస్తోంది.. దీంతో రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్రిటీష్ హై కమిషనర్ కలిసి.. తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామంటూ ఆసక్తిని కనబరిచారు. బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో రాష్ట్రంలో హెల్త్, ఎనర్జీ, ఎలక్ర్టిక్ వెహికల్స్, అగ్రికల్చర్ […]
హుజూరాబాద్ బై పోల్స్.. ఎన్నికల సంఘానికి టెన్షన్..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో.. త్వరలో జరిగే ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు బాటకు ఎవరికి వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. ఉద్యమకారులు, నిరుద్యోగులు, నేతన్నలు ..ఇలా ప్రభుత్వంపై ఆక్రోశం ఉన్న వారంతా తాము నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సత్తా చూపాలంటే హుజూరాబాద్ లోనే చూపాలని.. అప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని వారి భావన. దాదాపు 2200 మంది హుజూరాబాద్ […]
కోర్టు ఖర్చులకే కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఎలా..?
1,2 కాదు.. ఏకంగా 58 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు ఖర్చు పెట్టింది. అదేం ప్రజాప్రయోజనాల కోసం కాదు.. కోర్టు ఖర్చుల కోసమట.. ఈ విషయం తెలిసీ కోర్టు కూడా నివ్వెరపోయింది..ఇదేంటి.. ఇంత మొత్తం ఖర్చు పెట్టారు అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్ కార్యదర్శులకు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఈ […]
శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]
రేవంత్ లో అయోమయం.. అందుకే రాహుల్ రాక..
హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో కారు దూసుకుపోతుంటే.. బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు అభ్యర్థిని ప్రకటించికపోయినా వారికో క్లారిటీ ఉంది. ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఎవరు అనే విషయం కొలిక్కి రాలేదు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించినా […]









