ప్రభాస్ ను పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీస్.. సుమ ప్రశ్నకు డార్లింగ్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఇప్పటికే ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఐదుప‌దుల వయసు మీద పడుతున్నా.. ఇంకా పెళ్లాడకుండా సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ క్రమంలోనే.. రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు బ్రతికి ఉన్న రోజుల్లో ప్రభాస్ పెళ్లి పై ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఆ ప్రశ్నలు సంధిస్తున్నారు. కుమారుడు ప్రభాస్ గురించి తాజాగా ఆమె సమాధానాలు ఇచ్చింది. తనయుడు పెళ్లికి ఇంకెంతో సమయం లేదని.. త్వరలోనే వివాహం చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

కానీ.. ప్రభాస్ నోట మాత్రం పెళ్లి మాట వినిపించట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రముఖ పొలిటిషన్ కుమార్తె, బిజినెస్మెన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ అంటూ ఎంతో మందితో పెళ్లి వార్తలు వైరల్ అయినా.. అవేవీ నిజం కాలేదు. కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసాడు డార్లింగ్. ఈ క్రమంలోనే.. పెళ్లి విషయం అడిగిన ప్రతిసారి సమాధానాలు దాటేస్తున్నాడు. అలా.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది రాజాసాబ్‌ రిలీజ్ ఈవెంట్‌లోను మరోసారి ప్రభాస్‌కు పెళ్లి విషయంపై తెలివైన ప్రశ్నను సంధించింది సుమ.

అక్కడకు వచ్చిన లేడీ ఫ్యాన్స్ కూడా ఫ్లక్రార్డ్‌లు పట్టుకుని మరీ.. ప్రభాస్‌ను పెళ్లి గురించి అడగడం.. ప్రభాస్ పెళ్లాడాల్సిన అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటూ ఫ్లక్కార్ట‌క‌లు చూపిస్తూ డిమాండ్ చేయడంతో.. ప్రభాస్ దానిపై రియాక్ట్ అయ్యాడు. అసలు ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అని సుమ అడిగిన ప్రశ్నకు.. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ తెలివిగా రియాక్ట్ అయ్యాడు. దాన్ని అర్థం అసలు అమ్మాయిల్లె ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ప్రభాస్‌కు నిజంగా తెలియదా.. లేదా కావాలనే ల్యాగ్‌ చేస్తూ వస్తున్నాడా.. తన తికమక్కకు చెక్ పెట్టే అమ్మాయి ఇంకా ఆయనకు తారస పడలేదా.. అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఇక ప్రజెంట్ బిజీ లైన‌ప్‌ క్లియర్ అయిన తర్వాత అయినా.. పెళ్లి బాటలోకి అడుగు వేస్తాడా.. లేదా మరిన్ని ప్రాజెక్టులతో కెరీర్ పైన ఫోకస్ చేస్తాడా తెలియాల్సి ఉంది.