2025 టాలీవుడ్లో పెళ్లి సందడి మాములుగా లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను రివిల్ చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ స్టార్ కమెడియన్.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 4 కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తన లైఫ్ లోని కొత్త చాప్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చాలా కాలంగా సస్పెన్స్ లో ఉంచిన తన ప్రేమ కథను రివల్ చేస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. జబర్దస్త్ లో వర్షాతో కెమిస్ట్రీ నడుపుతూ తనదైన కామెడీ స్టైల్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఇమ్ము బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో అడుగు పెట్టిన తర్వాత ఎనర్జిటిక్ కామెడీతో అందరిని కడుపుబ్బనవ్వించాడు.
ఏకంగా తొమ్మిది వారాలపాటు నామినేషన్స్ లో లేకుండా రికార్డ్ క్రియేట్ చేశాడు. టైటిల్ రేస్ లో ముందు ఉంటాడని అంతా భావించినా.. చివరకు మూడో రనరప్‌గా బయటకు రావాల్సి వచ్చింది. ఇక.. ఈ బిగ్ బాస్ జర్నీలో దాదాపు 15 వారాలకు 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఇక జబర్దస్త్‌లో వర్ష ఇమ్మ మధ్యలో ఎఫైర్ ఉందని వార్తలు కొనసాగినా.. కేవలం అవి స్కిట్స్ కోసమే.. అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. తన రియల్ లైఫ్‌లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందంటూ చెప్పకనే చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. ఇమ్మానియేల్ ఓ ఇంటర్వ్యూలో ప్రేమలో ఉన్న మాట వాస్తవం. అమ్మాయి ప్రస్తుతం మెడిసిన్ కంప్లీట్ చేస్తుంది.
ఆమెపై ప్రైవసీ దృష్ట్య వివరాలను సీక్రెట్‌గానే ఉంచా అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానని వివరించిన ఇమ్ము.. అన్నట్టుగానే సోషల్ మీడియాలో తన లైఫ్ పార్టనర్ గురించి ఓ పోస్ట్‌ని షేర్ చేసుకున్నాడు. తన లవర్ చేతిని పట్టుకొని ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ముఖం చూపించకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఇమ్యుకు విషెస్ తెలియజేస్తున్నారు. తన కామెడీతో ఫ్యూచర్ మరింతగా వెలిగిపోవాలని.. త్వరలోనే ఇమ్ము ఓ ఇంటివాడు కావాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



