నాని కొత్త సినిమాపై నాగ వంశీ క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గత మూడు సినిమాలు దసరా, సరిపోదా శనివారం, హిట్ 3లతో వరుసగా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అందుకని మంచి ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీలైనప్‌తో సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా.. నాని సరికొత్త మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్.. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నాని ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు అంటూ.. గత కొంతకాలంగా వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్ చేయకపోయినా.. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అయిపోయిందని.. డైరెక్టర్ అని కూడా ఫిక్స్ చేసేసారు అంటూ.. 2026 సెకండ్ హాఫ్‌లో సినిమా షూట్ మొదలవుతుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ వార్తలపై.. నానితో ప్రాజెక్ట్ పై సీతారా నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. నానితో సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 సెకండ్ హాఫ్ లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువస్తానంటూ వివరించాడు.

Jersey is the most beautiful film of my career: Nani | Telugu News - The Indian Express

ఇక ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమా వల్ల బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దసరా ఫెమ్‌ శ్రీకాంత్ ఒడెల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను 2026 మార్చ్ 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని, సుజిత్ డైరెక్షన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. అతి 2026 చివరలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షూట్ మొదలుపెట్టనున్నార‌ట‌. అంటే 2026 సంవత్సరం చివరిలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.