చరణ్ కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుత బుచ్చిబాబు స‌న్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్ లో బిజీబిజీగా గ‌డునుతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి ఫస్ట్ సాంగ్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ ఇప్పటికే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. youtube లో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి సాంగ్ గా.. అలాగే హైయెస్ట్ లైక్స్ సంపాదించుకున్న నాలుగవ సాంగ్‌గా ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఈ క్రమంలోనే.. తాజాగా చరణ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. చరణ్ కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన ఏకైక సినిమా ఇదేనంటూ ఓ టాక్‌ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. ఆరెంజ్. ఈ సినిమాల్లో చరణ్ స్టైలిష్ ప్రజెన్స్‌, లుక్, అలాగే మ్యూజిక్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. మగధీర సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా.. చరణ్ కెరీర్‌లోనే అత్యంత ట్రెండి సినిమాగా తెరకెక్కింది. అప్పట్లో.. యూత్, లవర్స్ కనెక్ట్ అయ్యే రొమాంటిక్ కాన్సెప్ట్‌తో సినిమా తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా స్వయానా చర‌ణ్ బాబాయ్ నాగబాబు వ్య‌వ‌హ‌రించారు.

Ram Charan With Naga babu In Orange - YouTube

సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో ఆయన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా.. ఈ సినిమాలో.. చరణ్ హీరోగా నటించినందుకు రెమ్యున‌రేషన్ మాత్రం తీసుకోలేదట. తర్వాత చూద్దాంలే అని చెప్పేవాడట. అయినా.. నాగబాబు మాత్రం కాస్త అమౌంట్ ఇచ్చారట‌. అయితే.. సినిమా ఫెయిల్ కావడంతో దానిని తన బాధ్యతగా భావించి.. ఇది మన ఫ్యామిలీ సినిమా నష్టం వస్తే అందరం కలిసికట్టుగా ఉండాలి.. నాకు ఈ రెమ్యూనరేషన్ డబ్బే వద్దు అని తిరిగి ఇచ్చేసాడట. అప్పట్లో ఈ టాక్ తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇదే టాక్ మరోసారి ట్రెండ్ అవుతుంది.