2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూనకాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, సింగిల్, కుబేర సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్న.. యావరేజ్ హిట్‌లుగా నిలిచాయి. అయితే ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లో పెద్ద సినిమాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆడియన్స్ దృష్టి అంతా సెకండ్ హాఫ్ పై పడింది. ఇక సెకండ్ హాఫ్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్న స్టార్ హీరోల సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం.
2025 సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ప్రారంభమవుతుంది. జులై 24 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా.. ఏం రత్నం ప్రొడ్యూసర్గ, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా మెరవనున్నారు. కాగా.. ఈ సినిమా పవన్ కెరీర్‌తో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ కావడం.. అది కూడా డిప్యూటీ సీఎం గా వస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నేర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్, టీజర్ ఆడియన్స్‌లో సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొల్పాయి.
ఇక ఆగస్టు 14 బాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీ వార్ 2 సినిమాతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఆడియన్స్‌నుఎ పలకరించినన్నారు. తారక్‌కు ఉన్న క్రేజీ రిత్యా టాలీవుడ్‌లో సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఇక సినిమాకు నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడం మరో ఇంటరెస్టింగ్ విషయం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా. ఇక అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమా సైతం రిలీజ్ అవుతుంది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతిహాసన్ నటించిన సినిమాపై కూడా ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. గోల్డ్ మాఫియా ప్రధానంగా రూపొందిన సినిమా రూ.1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఇక సెప్టెంబర్‌లో రెండు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ఓజీ ఒకటి. అలాగే నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా సైతం ఇదే రోజున రిలీజ్ అవుతుంది. ఇర మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా కూడా సెప్టెంబర్ లో రిలీజ్ కు సిద్ధమవుతుందని టాక్ నడుస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో సినిమా కన్ఫర్మ్ అయిపోయిందట. జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సోషియ ఫాంటసీ డ్రామా కావడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి.
ఇక ఏడాది చివర్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ది రాజసాబ్ డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో 2025 సెకండ్ హాఫ్‌కు గ్రాండ్ ముగింపు అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా. హీరోల సినిమాల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో కలకలలాడేలా చేస్తుందో.. లేదో.. చూడాలి.