టాలీవుడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా ఆశిక రంగనాథ్, కోనాల్ కపూర్, నభ నటాషా తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాను.. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ పూర్తయిందని.. తాజాగా డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఒక్క సాంగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి.
ఇకపోతే విశ్వంభర రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ఉంచిన టీం.. మొదట ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ.. అదే టైంలో చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కావడం.. అలాగే సినిమా విఎఫ్ఎక్స్ సమస్యలు ఎదురు కావడంతో.. రిలీజ్ వెనక్కి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం.. విశ్వంభరకు సరికొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చారట. ఈ క్రమంలోనే సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ఒకవేళ విశ్వంభర ను ఇదే రోజున రిలీజ్ చేస్తే మాత్రం సినిమాకు బిగ్ రిస్క్ తప్పదనడంలో సందేహం లేదు.
కారణం.. సెప్టెంబర్ 25న దసరా కానుకగా బాలకృష్ణ అఖండ 2తో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సైతం రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఒకవేళ అఖండ 2 పోస్ట్ పోన్ అయినా.. తమ్ముడు పవన్ సినిమాతో చిరుకి పోటీ తప్పదు. ఈ క్రమంలోనే విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో చిరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడేమో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. సెప్టెంబర్ 18 రిలీజ్ చేస్తే.. ఓజీ కి వారం రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్దగా సమస్య ఏర్పడదు.. కచ్చితం ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ చేసి తీరాలని విశ్వంభర టీం పట్టుదలతో ఉన్నారట. మరి ఇదే జరిగితే మాత్రం అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్ స్ట్రాంగ్ గా ఉంటుంది.