ప‌వ‌న్ ‘ వీర‌మ‌ల్లు ‘ ఈస్ట్ రైట్స్‌కు అంత డిమాండా.. వ‌ర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ హరిహర వీరమల్లు. పవన్ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. మరో 10 రోజుల్లో సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే.. పవన అభిమానుల్లో సినిమాపై భారీ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ సాధీర‌ణ‌ ఆడియన్స్ సైతం సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు అన్ని ఏరియాల్లో రికార్డుల స్థాయిలో బిజినెస్ లో జరుగుతుండడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు.. వీరమల్లు ఈస్ట్ గోదావరి హక్కులకు ఊహించని రేంజ్ లో భారీ డిమాండ్ నెలకొందట.

ఈ సినిమా ఏకంగా రూ.13 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని.. ఇండస్ట్రీలో టాక్ న‌డుస్తుంది. గోదావరి జిల్లాలలో పవన్ కు పిక్స్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో.. ఇక్క‌డ పవన్ సినిమాల్లో హక్కులకు సైతం భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. ఇక వీరమల్లు సినిమా బిజినెస్ విషయంలో సంచలనాలు సృష్టించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా.. బిజీ బిజీగా రాణిస్తున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం అసాధ్యం అంటూ మొదట టాక్ వినిపించినా.. తాజా సమాచారం ప్రకారం సినిమా ప్రమోషన్స్ లో సైతం పవన్ సందడి చేయనున్నాడట. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్‌ నెలకొంటుంది.

Pawan Kalyan's 'Hari Hara Veera Mallu' likely to be delayed further: Report  | - The Times of India

ఈ క్రమంలోనే భారీ అంచనాలను నడుమ రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాలి. అయితే.. సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం వస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే పవన్ లైనప్‌లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా పూర్తి చేసి.. పవన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్టర్లు అందుకుంటే.. ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. తెలంగాణలో సైతం హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్ లో పెంపుకు అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ సినిమా రిజల్ట్ తో పవన్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉండను ఉందో క్లారిటీ వచ్చేస్తుంది.