నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టీం సినిమాను ఏడాది దసరాబరిలో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
కాగా జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న పలు సినిమాల ట్రీట్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకొనున్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2 నుంచి ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించే ఓ మాస్ ట్రీట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ ట్రీట్ ఏంటో అసలు ఫ్యాన్స్‌కు నాకంటూ మేకర్స్ ఏం సర్ప్రైజ్ ఇవ్వనున్నారు తెలియాల్సి ఉంది.
కాగా బాలయ్య నటించిన మాస్ బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటైన లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ కు మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాలయ్య పుట్టినరోజు జూన్ 10న కాగా దీనికి ముందే జూన్ 7 నుంచి ధియేటర్లో ఈ సినిమాలో ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇక జయంత్ సీ పరాంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.