అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ త‌మిళ స్టార్ హీరోయే.. ఇక ఊర‌మాస్ జాత‌రే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్‌. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్‌. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమో నెటింట‌ తెగ సందడి చేస్తుంది.

Balayya Panduga (From "Unstoppable With NBK 4") - Single by Jakes Bejoy |  Spotify

ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంభందించిన ఓ గుస్‌బంప్స్‌ అప్డేట్ వైర‌ల్‌గా మారింది. అదేంటంటే 4వ సీజ‌న్ పెకెండ్ ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్‌గా తమిళ్ స్టార్ హీరో సూర్య హాజరై సందడి చేయనున్నాడట‌. నేడు ఈ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. దానికోసం స్పెషల్‌గా ప్లాన్స్ కూడా సిద్ధం చేశారట మేకర్స్. ఇక గతంలో సూర్య ఓ ఇంటర్వ్యూలో బాలయ్య సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన హీరోతో టాక్ షో ఎలా సాగుతుందని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక సూర్య తన నెక్స్ట్ మూవీ కంగువ‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నాడు.

Unstoppable with NBK : బాలయ్య షోకు హీరో సూర్య.. ఆయనతో పాటు  ఇంకెవరొస్తున్నారంటే - Telugu News | Tamil star hero Suriya will be the  second guest on Unstoppable with NBK S4 | TV9 Telugu

ఈ మూవీ డైరెక్టర్ శివ కూడా షోలో హాజరుకానున్నాడట. పీరియాడికల్ వార్ డ్రామాగా కంగువ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కాగా సినిమాలో విలన్ గా కనిపించనున్న బాబీ డియోల్ కూడా షోలో హాజరై సందడి చేస్తున్నాడ‌ట. ఇక గతంలో బాలకృష్ణ మరో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్‌ను అన్‌స్టాప‌బుల్‌తో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కంగువ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో.. సూర్య, బాలయ్యల మధ్యన జరిగే సంభాషణ ఏ రేంజ్ లో హైలెట్ కానుందో వేచి చూడాలి.