ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

చాలామంది నటీనటులు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటివారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటి.. తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. ఈ అమ్మడి అందానికి టెంప్ట్ కానీ కుర్రాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం అమ్మడి సొంతం. ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా.. ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైంది.

Hansika Motwani Makes Jaws Drop With Bold Photos, See The Diva's Sexy  Pictures - News18

అయితే ఇటీవల బుల్లితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఈ పై ఫోటోలో ఉన్న చిన్నది మరెవరో కాదు హాట్ బ్యూటీ హన్సిక మోత్వాన్ని. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తన అంద‌చందాలతో కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నది.. మొదట బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇక దేశముదురు తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ నటించి మెప్పించింది.

Hansika Motwani's Husband Sohael Khaturiya Gets Her Name Tattooed on Arm -  Sakshi

బాలీవుడ్‌లోను ప‌లు సినిమాల్లో చేసింది. ఇక కొంతకాలం క్రితం పెళ్లి పీటలెక్కి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో కుర్రకారును టెంప్ట్ చేస్తుంది. అంతేకాదు పలు టీవీ షోలోను జడ్జ్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడి చైల్డ్‌హుడ్‌ ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ అమ్మడుకి టాలీవుడ్ లో కంటే.. తమిళ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హన్సికను అక్కడ అభిమానులు గుడి కట్టి మరీ పూజించారంటే.. ఏ రేంజ్‌లో ఆమెను అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ చిన్్న‌ది మరోసారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది.