మంచు మనోజ్ కెరీర్ స్టార్టింగ్‌లో నటించి సూపర్ హిట్ సక్సస్ అందుకున్న సినిమాలలో బిందాస్ ఒకటి. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీ.. 2010లో రిలీజైన మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో మనోజ్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. వీరూ.పోట్ల డైరెక్షన్‌లో బచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ జంటగా షీనా షహబాది నటించి ఆకట్టుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు చూడటానికి అచ్చ తెలుగు అడపడుచులా అనిపిస్తుంది.
ఇక ఈ మూవీలో గిరిజ పాత్రలో అల్లరి అమ్మయిగా నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక షీనా తల్లి బాలీవుడ్ ప్రముఖ నటి సాధనా సింగ్.. ఈమె అడుగు జాడల్లోనే షీనా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తేరే సంగ్ అనే హిందీ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించిన షీనా.. తెలుగులో బిందాస్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్‌తో తర్వాత షీనాకు వరుస అవకాశాలు వచ్చాయి. తొలిసారిగా , తారక రత్న నందీశ్వరుడు.. లాంటి సినిమాల్లోను నటించింది. యాక్షన్ త్రీడీ, నువ్వే నా బంగారం, రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ సినిమాల్లోను తళ్ళుకున మెరిసింది.
అయితే ఆ సినిమాలేవీ పెద్దగా సక్సస్ కాలేదు. దీంతో 2015 తర్వాత షీనా ఇండస్ట్రీకి దూరమైంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే షీనాకు పెళ్లి అయ్యింది. 2007లో వైభవ్ గోరే అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొంతకాలానికే అతనికి విడాకులు ఇచ్చేసింది.అందాల తార. వివాహం, విడాకుల గురించి ఎన్నో సందర్భాల్లో షీనా మాట్లాడుతూ తన జీవితంలో ఇది అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అంటూ వివరించింది. అయితే అక్కడితో ఆగిపోకుండా.. సినీమాలోకి ఎంట్రీ ఇచ్చి.. హిందీతో పాటు తెలుగు, కన్నడ సినిమాల్లోనూ క్రేజ్ సంపాదించుకుంది.