ఆ ఒక్క ఇన్సిడేంట్ నే నాగ్ అశ్వీన్ కు “కల్కి” సినిమా తెరకెక్కించాలి అనే ఆలోచన తీసుకొచ్చిందా..? గ్రేట్..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు చరిత్రను తిరగరాసాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఒకసరి కొత్త కాన్సెప్ట్ తో అద్భుతమైన విజన్ తో నాగ్ అశ్వీన్ తెరకెక్కించాడు కల్కి అనే సినిమాను అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో రెబల్ ఫాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఓ హ్యూజ్ పాజిటివ్ టాక్ దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ సినిమా కల్కినే కావడం గమనార్హం .

అయితే కల్కి సినిమాను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు నాగ్ అశ్వీన్. మన పురాణాలను బేస్ చేసుకుని అత్యాధునిక టెక్నాలజీ ను వాడుకుంటూ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే కాన్సెప్ట్ ను తనదైన స్టైల్ లో తెరకెక్కించి జనాలకు ఒక అవగాహన కల్పించాడు . అయితే ఇలాంటి థాట్ ఇంతకుముందు ఏ డైరెక్టర్ కి ఎందుకు రాలేదు..? అసలు నాగ్ అశ్వీన్ కే ఎందుకు ఇలాంటి ధాట్ వచ్చింది అనేది ఇప్పుడు హైలెట్గా మారింది . నాగ్ అశ్వీన్ ఒకే ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మరి ఈ సినిమాని తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యారట . చాలామంది కలియుగం అంతరించిపోతుంది అంటూ ఉంటారు .. మన ఇళ్లలోని పెద్దవాళ్ళు కూడా పాపాలు పెరిగిపోతున్నాయి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా దారుణాలు చూడాలి.. కలియుగం అంతరించిపోతుంది ..

మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడు అప్పుడే యుగాంతం వస్తుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అలాంటి ఓ మాట విన్నప్పుడే నాగ్ అశ్వీన్ కు ఈ ధాట్ వచ్చిందట. మనమెందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని జనాలకి అర్థం అయ్యే రీతిలో చూపించకూడదు..? నిజంగానే కలియుగం అంతరించిపోతుందా..? కల్కి జన్మించబోతున్నాడా..? ఒకవేళ జన్మిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ..? అనేది నేటి కాలం జనరేషన్ పిల్లలకు అర్థమయ్యే రేంజ్ లో భారీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో తనదైన స్టైల్ లో సీన్స్ మార్చుకొని తన విజన్ న్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెరకెక్కించాడు . మొత్తానికి నాగ్ అశ్వీన్ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు . సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు చరిత్ర తిరగరాసేస్తుంది అందులో నో డౌట్ అంటున్నారు రెబల్ అభిమానులు..!!