ఫస్ట్ టైం వెంకటేష్ చేత ఆ పని చేయించబోతున్న అనిల్ రావిపూడి.. బిగ్ రిస్క్ చేస్తున్నాడే..?!

మనకు తెలిసిందే.. సీనియర్ హీరోస్ ఈ మధ్యకాలంలో టూ ఆక్టివ్ గా మారిపోయారు . ఎంతలా అంటే యంగ్ హీరోస్ కూడా చేయలేని పనిని చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది సీనియర్ హీరోస్ లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్లో సీనియర్ పొజిషన్ వచ్చాక వెంకటేష్ చేత అలాంటి సీన్స్ లో నటింపజేస్తున్నాడు అనిల్ రావిపూడి . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .

వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . కాగా ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది . వెంకటేష్ లాస్ట్ గా నటించిన సినిమా సైంధవ్.. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ నుంచి బయటపడడానికి వెంకటేష్ ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఒక లిప్ లాక్ సీన్లో నటించబోతున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది .

మీనాక్షి చౌదరితో లిప్ లాక్ సీన్లో నటించబోతున్నాడట వెంకటేష్ . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అయితే సీనియర్ పొజిషన్ వచ్చాక వెంకటేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. కొంతమంది ఇది పెద్ద బూతు కాదులే అంటుంటే మరి కొంత మంది మాత్రం ఏమో జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అంటూ భయపడిపోతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??