బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కమెడియన్లుగా మారిన ఎంతోమంది సినిమాల్లో హీరోలుగా కూడా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మరి కొందరు నటులుగా వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ల రీల్ లైఫ్ లో ప్రేక్షకులను ఎంతగా నవ్వించినా.. చాలామంది రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఉంటాయి.
తాము ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టం ఉందంటూ వారు చెబుతూ ఉంటారు. ఇప్పటికే అలా చాలామంది కమెడియన్లు తమ అనుభవాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్.. తన లైఫ్ లో జరిగిన ఓ విషాదకర సంఘటన గురించి ఎమోషనల్ అయ్యాడు. తాత చనిపోయిన చివరి చూపుకు కూడా వెళ్లలేకపోయానని.. తాత చావుని విన్న వెంటనే కళ్ళు తుడుచుకొని వెళ్లి జబర్దస్త్ స్కిట్ చేశాను అంటూ షాకింగ్ విషయాలను రివిల్ చేశాడు. జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో షూటింగ్ సమయంలో నాన్న కాల్ చేశారని.. తనకు ఎంతో ఇష్టమైన తాత చనిపోయారంటూ వివరించారని.. దీంతో ఎంతో బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే అదే టైం కి నేను స్కిట్ చేయాల్సి ఉండడంతో.. వెంటనే వెళ్లలేకపోయానని ఆయన చెప్పుకొచ్చాడు. బాధపడుతూనే కన్నీళ్లు తుడుచుకొని స్కిట్ చేశాను అంటూ చెప్పిన ఇమ్ము.. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చిందని వివరించాడు. అయితే స్కిట్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లేసరికి తాత అంత్యక్రియలు జరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. ఇమ్మానుయేల్ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న ఇమ్ము.. వర్షతో జబర్దస్త్ స్టేజ్ పై లవ్ ట్రాక్ నడుపుతూ స్కిట్స్ తో అదరగొడుతున్నాడు. వీరిద్దరూ కలిసి చేసే స్కిట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు ఇమ్మానుయేల్.