పుష్ప 2 నుంచి ఎలాంటి పోస్టర్ రిలీజ్ అయినా సరే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం చూస్తే అదో స్పెషల్ తెలియని కిక్కు వచ్చేస్తుంది . అలా పుష్ప 2 కి సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కలు మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే ఈ పుష్ప2.
ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క పోస్టర్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో మెరుస్తున్న రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప2 టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ మేరకు ప్రతి పాత్రను పోషించే డైనమిక్ నటుడు రావు రమేష్ కి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపింది . “పుష్ప 2 ది రూల్ లో అతనిది శక్తివంతమైన రాజకీయ నాయకుడు సిద్ధప్పగా చూడండి” అంటూ చెప్పుకొచ్చారు . చాలా చాలా ఊర నాటు మాస్ లుక్ లో రావు రమేష్ అదరగొట్టేసాడు. సిద్ధప లుక్ లో కేక పెట్టిస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మరింత హ్యూజ్ బజ్ నెలకొంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.