టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న పవన్ సినిమాల్లో అవకాశాల కోసం ఎంతమంది స్టార్ నటినటులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ని సంప్రదించగా.. ఆమె ఆ క్యారెక్టర్ చేయనని తెగేసి చెప్పేసిందంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తాజాగా మళ్లీ తన మూడు ప్రాజెక్ట్‌తో సెట్స్ పై బిజీ అయ్యారు.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ లో ఉన్నాడు. హర వీరమల్లు నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు. మరో డైరెక్టర్ ఈ సినిమా రెండో పార్ట్ ను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్.. ఓజీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెటింట వైరల్ అవుతుంది.
కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ టబును సంప్రదించగా ఆమె ఆ సినిమాలో నటించనని రిజక్ట్ చేశారట. టబ్బు పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉండడంతో ఈ పాత్రకు వెయిట్ ఉన్న ఆమె ఆ రోల్ చేయనని చెప్పేసిందని.. దీంతో తర్వాత ఆ అవకాశం శ్రేయ రెడ్డికి వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాల్లో బన్నీ తల్లి పాత్రలో టబ్బు నటించి మెప్పించింది. క్యారెక్టర్ రోల్స్ లో చేస్తున్నప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చేయడం ఇష్టంలేకే ఆ అవకాశాన్ని ఆమె రిజెక్ట్ చేసిందంటూ తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు.