అభిమానుల చెవిలో పెద్ద పువ్వు పెట్టాడు ప్రభాస్ ..స్పెషల్ పర్సన్.. స్పెషల్ పర్సన్ అంటూ సినిమాని బాగానే హైలెట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ ని ఏ రేంజ్ లో జనాలు తిట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ను స్క్రాచ్ పేరిట రిలీజ్ చేస్తున్నారు నాగ్ అశ్వీన్. ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ అద్దిరిపోయే వీడియోని రిలీజ్ చేశారు . అయితే ఆ వీడియో కి ముందు ప్రభాస్ తన లైఫ్ లోకి స్పెషల్ కోసం రాబోతుంది అంటూ హింట్ ఇచ్చాడు. అందరూ వదినమ్మ రాబోతుంది అంటూ తెగ ఎంజాయ్ చేశారు. సీన్ కట్ చేస్తే తన లైఫ్ లోకి వచ్చిన స్పెషల్ పర్సన్ బుజ్జి. ఇది ఓ వ్యక్తి కాదు ఒక వెహికల్ . చాలా మంది బుజ్జి అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు .
రీసెంట్గా ఆన్సర్ దొరికేసింది . మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో..? బుజ్జిని కూడా ఒక బ్రెయిన్ అలాగే కంట్రోల్ చేస్తుంది..? ఈ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది కీర్తి సురేష్ ..సచ్చినోడా అంటూ తిట్లు కూడా తిడుతుంది .. బుజ్జిని తయారు చేసిన విధానం ఈ వీడియోలో బాగా చూపించాడు నాగ్ అశ్వీన్.. కాగా బుజ్జికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కీర్తి సురేష్ చాలా చాలా కష్టపడిందట . నాగ్ అశ్వీన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. చాలా డెడికేటెడ్ పర్సన్ .. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు కీర్తి సురేష్ చెప్పే వర్డ్స్ కొన్ని కొన్ని బాగా రాకపోవడంతో ఒకటికి 50 సార్లు ప్రాక్టీస్ చేయించి.. మరి బుజ్జి కి వాయిస్ ఓవర్ ఇప్పిచ్చారట నాగ్ అశ్వీన్. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ప్రభాస్ కోసం కీర్తి సురేష్ బాగానే కష్టపడింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!!
Presenting ‘𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji‘ from #Kalki2898AD!!!https://t.co/PwgcOBfJcf @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/tfmW7EtYiF
— Kalki 2898 AD (@Kalki2898AD) May 18, 2024