ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి రెడీ అయిన అనుష్క.. అందుకే అలా చేస్తుందా..?!

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న చిన్న హీరోలతో నటిస్తూనే భారీ పాపులారిటి దక్కించుకుంది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మ‌డు దాదాపు తెలుగు అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లోను నటించి తన సత్తా చాటుకుంది. సౌత్ లో ది బెస్ట్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో తన మార్కెట్ మరింతగా పెంచుకుంది.

'Kathanar - The Wild Sorcerer': Jayasurya welcomes Anushka Shetty on board;  fans wonder if she is playing Neeli! | Malayalam Movie News - Times of India

అయితే మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇప్పటికే అనుష్క పాపులారిటీ అదే రేంజ్‌లో కొనసాగుతుంది. నిశ్శబ్దం మూవీ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన అనుష్క.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కోసం నవీన్ పోలిశెట్టితో జతకట్టింది. ఈ సినిమా తర్వాత ఇటీవల కృష్ డైరెక్షన్లో మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క.. దీంతోపాటే మలయాళం లోను ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన న్యూస్ నెటింట వైరల్ గా మారింది.

Anushka Shetty starts shooting for her debut Malayalam film

త్వరలోనే అనుష్క కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా పెళ్లి కానీ 40 ప్లస్ ఏజ్ ఉన్న ఓ ప్రొడ్యూసర్ అనుష్కకు పెళ్లి ప్రపోజల్ పెట్టారని.. అతనితో పెళ్లంటే అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎలాగో నిర్మాత కనుక సినిమాల విషయంలో పెద్దగా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశాలు లేవని.. అందుకే ఆమె ఆ నిర్మాతతో పెళ్లికి ఓకే చెప్పిందని టాక్‌. అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు చూడాల్సిందే.