వాట్.. పైనాపిల్ టేస్ట్ తో పాటు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు టేస్టీగా ఉండే పండ్ల‌ని ఆహారంగా తీసుకోవడానికి.. వాటిని ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాంటి పండ్లలో పైనాపిల్ మొదటి వరుసలో ఉంటుంది. పుల్లపుల్లగా, తీయతీయ నోటికి రుచిగా అందరూ ఇష్టపడే విధంగా ఉండే ఈ ఫ్రూట్.. రుచితో పాటు అదే మోతాదులో హెల్తీ బెనిఫిట్స్‌ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ పైనాపిల్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పైన్ఏపిల్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

The health benefits of pineapple | Good Food

పైనాపిల్‌ విటమిన్ b6, విటమిన్ సి, మాంగనీస్, పోలేట్, కాపర్, ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పైనాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటానికి కీలకపాత్ర వహిస్తుంది. ఇందులో ఉండో ప‌లు ఎంజైమ్‌లు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహకరిస్తాయి. అలాగే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల అజితి, మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా లభిస్తోంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో తోడ్ప‌డుతుంది.

Pineapple - Slices

దీంతో మనం వాతావరణ మార్పులు కలిగిన సమయంలో కూడా అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే పైనాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచేందుకు.. రక్తపోటు నుంచి కాపాడేందుకు.. పైనాపిల్ సహకరిస్తుంది. విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. చర్మ ఆరోగ్యాని కాపాడేందుకు తోడ్పడతాయి. పైనాపిల్ తరచూ తీసుకోవడం వల్ల చర్మం పై ఉండే మచ్చల సమస్య తొలగి అందంగా కనిపిస్తుంది. కాంతివంతంగా చర్మం తయారవుతుంది.