వావ్: పదేళ్ల తరువాత ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న నాగ చైతన్య.. వీడు వెరీ లక్కి ఫెలో..!

నాగచైతన్యతో పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోయిన్ రొమాన్స్ చేయబోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ జనాలకు మాత్రం ఆయన నటన బాగా నచ్చుతుంది. ప్రజెంట్ నాగచైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడట . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగచైతన్య క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు . విరూపాక్ష చిత్రంతో అందరి అటెన్షన్ను గ్రాబ్ చేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన నెక్స్ట్ సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం హారర్ జోనర్ ల్లోనే తెరకెక్కించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది పూజ హెగ్డే. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక లైలా కోసం అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ జంట జతకట్టబోతు ఉండడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!