హమ్మయ్య..ఇక ఊపిరి పీల్చుకోండి రా..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..!

డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకి గుడ్ న్యూస్ వినిపించాడు . అయితే మీరు అనుకున్నట్లు అది పెళ్లి విషయం కాదు. డార్లింగ్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుందని అనుకుంటున్నారా ..? ఇది చదవండి మీకే అర్థమయిపోతుంది . కచ్చితంగా రెబల్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఇది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో డార్లింగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ప్రభాస్ ఎక్కువగా ఆస్తులను కూడా పెడుతున్నాడట. మొన్ననే వంద కోట్లు ఖర్చుపెట్టి తన లగ్జరీ ఫామ్ హౌస్ ని నిర్మించుకున్నట్లు తెలిసింది . ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ విదేశాలలో కూడా ఇల్లు కొంటున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మొన్నటికి మొన్న డార్లింగ్ ప్రభాస్ లండన్ లో ఇల్లు కొన్నాడు అని కోట్లు ఖరీదు చేసే బంగ్లాను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అని వార్తలు వినిపించాయి .

రీసెంట్గా ఇప్పుడు ఇటలీలో కూడా ప్రభాస్ ఇల్లు కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇది పూర్తిగా లగ్జరీయస్ బంగ్లాగా తెలుస్తుంది . షూటింగ్ ల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభాస్ బయట స్టే చేయడం ఇష్టం లేకనే ఓ ఇల్లు కొనుక్కున్నారట . ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాడట . ఫైనల్లీ ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది . దీంతో రెబల్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.

అంతేకాదు నీ పెళ్లి తాలూకా గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తే వింటాం బాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . దీంతోపాటు ది రాజా సాబ్ సినిమా సెట్స్ పై ఉంది. చూద్దాం.. ప్రభాస్ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తాడో..??