అల్లు అర్జున్ సెన్సేషనల్ డెసిషన్.. స్టార్ డైరెక్టర్లకు బిగ్ టెన్షన్ స్టార్ట్ అయ్యిందిరోయ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ లెక్కల మాస్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పుష్ప వన్ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. అంతేకాదు హాట్ ఐటమ్ గర్ల్ దిశా పటాని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందట . ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధమైంది .

సోషల్ మీడియాలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు . ఆ రోజు ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసేందుకు టీం రెడీ అయిందట . అయితే మరోపక్క అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ కమిట్ అయినా డైరెక్టర్స్ కూడా క్రేజీ క్రేజీ అనౌన్స్మెంట్ రెడీ చేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కాగా ఇప్పటికే అల్లు అర్జున్ నెక్స్ట్ లిస్టులో డైరెక్టర్ అట్లీ , బోయపాటి శ్రీను , త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు , లోకేష్ కనగరాజు లాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు . అయితే ఏ డైరెక్టర్ కి ముందు ఛాన్స్ ఇస్తాడు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది . అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను అట్లీతో ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. అయితే నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు మాట కూడా ఇచ్చేసాడట.

కానీ గుంటూరు కారం ట్రోలింగ్ జరిగిన కారణంగా త్రివిక్రమ్ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు స్కంద తర్వాత బోయపాటికి కూడా పెద్దగా క్రేజ్ లేదు . అందుకుఆయన వెనక్కి నెట్టేసారట . వీళ్ళకి సంబంధించిన సినిమా డీటెయిల్స్ ఏది కూడా తన బర్త్డ డే నాడు రిలీజ్ చేయకూడదు అంటూ కండిషన్ పెట్టారట . దీంతో ఈ డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటూ జనాలు వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!