ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే మహేష్ లైఫ్ ఇంత హ్యాపీగా ఉందా..? మహా జాదూగాడే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు చాలా తెలివైనవాడు ..మొండివాడు ఇలా అందరికీ తెలిసిన విషయాలు అందరం మాట్లాడుకుంటూనే ఉంటాం . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఆయన ఓ జాదు క్యారెక్టర్ అంటూ బయటపడింది. ఆయన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఆయన తీసుకున్న నిర్ణయాల కారణమంటూ ఫాన్స్ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు.

ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన మహేష్ బాబు ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం అందరికీ హాట్ టాపిక్ గానే ఉంది . కాగా మహేష్ బాబు- రాజమౌళి సినిమా కోసం భారీ స్థాయిలో బరువు తగ్గబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం డూప్ లేకుండా రిస్కీ షాట్స్ చేయబోతున్నాడు . అయితే మహేష్ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లడానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయం అంటున్నారు జనాలు .

మహేష్ బాబు తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వల్గర్ గా కనిపించిన పాత్రలు ఏదీ లేదు ..ఎక్కడా కూడా టు హాట్ బెడ్ సీన్స్ చేసిన సందర్భాలే లేవు మొదటి నుంచి ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడట . ఎప్పుడు కూడా లిమిట్స్ క్రాస్ చేయకూడదు అవసరమైతే సినిమాలు అయినా మానేయలే కానీ ఘట్టమనేని ఫ్యామిలీ పరువు మాత్రం తీయకూడదు అంటూ ఫిక్స్ అయ్యాడట . అందుకే మహేష్ బాబు ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు అని ..మహేష్ వన్ అండ్ ఓన్లీ పీస్ అని ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు..!!