కట్టప్ప చేతిలో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఓ హీరో.. విలన్ లా కూడా ఆకట్టుకుంటున్నాడు.. ఎవరు గుర్తుపట్టారా..?!

సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులనుచ త‌న న‌ట‌న‌తో అక‌ట్టుకునే వారిలో సత్యరాజ్ ఒకడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలిలో కట్టప్ప పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సత్యరాజ్‌కు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో ఒకటి నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ పై ఫోటోలో కట్టప్ప ఒళ్ళో కూర్చున్న చిన్న బాబు ప్రస్తుతం మలయాల ఇండస్ట్రీ సూపర్ స్టార్ హీరోగాను నటిస్తున్నాడు. అలాగే విలన్ పాత్రలోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో భార్య కూడా.

ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ. ఇంతకీ ఆ నటుడు ఎవరో అనుకుంటున్నారా.. పుష్ప మూవీలో నటించి మెప్పించిన ఫహద్ ఫాజిల్. మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఫ‌హద్ ఫాజల్, సత్యరాజ్ నటించిన తమిళ్ రీమేక్‌ సినిమా ఎన్‌ బొమ్మకుట్టి అమ్మవుక్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ సినిమా లొకేషన్స్ నుంచి ఈ ఫోటోను స్వేకరించారు. ఇందులో సత్యరాజ్ కీలకపాత్రలో మెప్పించాడు. డైరెక్టర్ ఫాజిల్ తెర‌కెక్కించిన కయ్యతందూరత్లో ఫాజిల్‌ సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ ప్రేక్షకులను మెప్పించకపోయిన.. తర్వాత ఫాజిల్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చిన్న వయసులోనే బాలునటులుగా మెప్పించిన.. 1992లో మమ్ముట్టి, శోభన్ బాబు నటించిన పప్పా సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు.

డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాలో ప్రతి నాయకుడుగా మెప్పించాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన సునీల్, అనసూయ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వల్గా పుష్పా 2 సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో మెప్పించాడు. ఇక ఏడాది ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుంది. మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్. ఫహద్ కలిసి బెంగళూరు డేస్‌ సినిమాలో నటించారు. ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమతో వివాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.