వాట్ : చిరంజీవి స్టార్ హీరోగా మారడానికి కారణం ఆ ప్రొడ్యూసర్ ఆ.. సీక్రెట్ రివిల్ చేసిన మెగాస్టార్.. ?!

తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశాడు. తాజాగా జరిగిన ఈ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ల వీరిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. చిరంజీవిని.. విజయ్‌ ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్‌లో ఎదురైన తీవ్రమైన అవమానాన్ని గురించి ఆయన షేర్ చేసుకున్నాడు. ఈ అవమానంతో స్టార్ అవ్వాలని కసి తనలో మరింతగా పెరిగింది అంటూ వివరించాడు. 1981లో తెర‌కెక్కిన న్యాయం కావాలి సినిమాకు నిర్మాతగా క్రాంతి కుమార్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూట్ టైంలో ఆ కారణంగా ఆయన నన్ను అరిచారని.. ఆ మూవీ షూటింగ్ టైంలో అందరి మధ్య అరిచేసరికి నాకు చాలా బాధగా అనిపించిందని.. చిరంజీవి వివరించారు. నువ్వు ఏమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ.. క్రాంతి కుమార్ చేసిన అవమానం నాలో మరింత కసిని పెంచిందని.. అప్పుడే సూపర్ స్టార్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అంటూ వివరించాడు. తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఈ స్టేజ్ కు నేను రాగలిగాన‌ని.. అందుకు ఉదాహరణగా ఈ న్యాయం కావాలి సినిమా షూటింగ్ టైంలో ఆయనకు జరిగిన అవమానాన్ని గురించి వివరించాడు.

ఈ సినిమా షూటింగ్ టైంలో నిర్మాత క్రాంతి కుమార్ క్రేన్ పై కూర్చుని షూటింగ్ అంతా ఆపరేట్ చేస్తున్నారని.. అక్కడ మూడు, నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని.. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను ఒకసారి రమ్మని పిలిచారని.. ఆ తర్వాత నేను నా బోనులో నిలుచున్నా అప్పుడు క్రాంతి కుమార్ నన్ను అందరి ముందు గట్టిగా అరిచారు.. ఏంటండీ మిమ్మల్ని కూడా పిలవాలా.. వచ్చి ఇక్కడ పడి ఉండలేరా.. సూపర్ స్టార్ అనుకుంటున్నారా.. మీరు ఏమైనా అని అయన నాపై ఫైర్ అయ్యాడని.. దాంతో నాకు చాలా బాధగా అనిపించిందని.. చిరంజీవి వివరించాడు.

ఆ రోజు కోపంతో నేను మధ్యాహ్న భోజనం చేయలేదని.. చివరికి సాయంత్రం క్రాంతి కుమార్ పిలిచి నాకు వివరణ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన అనుకున్న మిగతా మాటలు వదిలేసిన సూపర్ స్టార్ అనుకున్నావా అన్న మాటలు మాత్రం వదిలేయలేదని.. అవును అయి చూపిస్తా అనుకున్నానని.. ఆకసితోనే ఇప్పటివరకు ఎంతో శ్రమించి వర్క్ చేశానని.. నాకు మెగాస్టార్ బిరుదు రావడానికి కూడా ఒక అందుకు ఆయన అన్న ఆ మాటలే కారణం అంటూ చిరంజీవి వివరించాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి తన 156వ‌ సినిమా విశ్వంభ‌ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతుంది.