“ఆ టాలీవుడ్ హీరోకి ఎప్పటికి పెళ్లి కాదు”.. ఫ్యాన్స్ కి మండిస్తున్న వేణు స్వామీ కామెంట్స్..!!

టాలీవుడే కాదు.. బాలీవుడ్ – కోలీవుడ్ – మాలీవుడ్ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న న్యూస్ ప్రభాస్ పెళ్లి. అలాంటి ఆయన పెళ్లి పై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మన రెబెల్ హీరో ప్రభాస్ పెళ్లి వార్త అనే చెప్పాలి. ఇతగాడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా..? అని పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

అయితే రీసెంట్గా ప్రభాస్ పెద్దమ్మ 2024లో ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అని ఖచ్చితంగా మీరు 2024 సంవత్సరంలో గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పుకొచ్చింది . కానీ వేణు స్వామి చెప్పిన మాటలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి . ఆయన జాతకంలో అసలు పెళ్లి రాత లేదని ..ఆయనకు పెళ్లి యోగం లేదు అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు మండేలా చేస్తుంది.

అంతేకాదు సలార్ విషయంలోనూ వేణు స్వామి అలాగే మాట్లాడారు . సలార్ సినిమా హిట్ అవ్వదు అన్నారు ..కానీ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాలుగు సినిమాలకు ఒక సినిమా హిట్ అయితే హీరోయిజమా..? అంటూ స్ట్రైట్ గానే కౌంటర్ వేశారు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పెళ్లిపై వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . చూడాలి మరి వేణు స్వామి మాటలను నిజం చేస్తాడో..? లేక పెళ్లి చేసుకొని ఆ మాటలను అబద్ధమని ప్రూవ్ చేస్తాడో.. మన రెబల్ హీరో..?