వామ్మో .. ఏంటిది హీరోయిన్ తమన్నా ఇంత వైలెంట్ గా మారిపోయింది..? ఆ హీరోయిన్ పై పోలీస్ కేసు వేయడానికి సిద్ధంగా మారిపోయిందా ..? ఏంట్రా బాబు ఇది . ఇలాంటి కామెంట్స్ తోనే ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువగా వార్తలు వైరల్ అవుతున్నాయి . మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటుంది .
టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత కోలీవుడ్ – బాలీవుడ్ లో కూడా నటించింది . అయితే తమన్నా సినిమాలు చేస్తున్న టైంలో ఓ యంగ్ హీరోయిన్‌తో బాగా క్లోజ్ గా మూవ్ అయింది . టూర్లకి వెళ్తూ బర్త డే పార్టీస్ అంటూ బాగా ఎంజాయ్ చేశారట. ఆ టైంలోనే ఆ హీరోయిన్ ఐదు కోట్లు తమన్నా వద్ద అప్పుగా తీసుకుందట .
అయితే ఆ తర్వాత ఆ డబ్బు గురించి పట్టించుకోకపోగా తమన్నా డబ్బు అడుగుతున్నా సరే ఆమె నెగ్లెజెన్సీ చూపించడం.. తమన్నా పై రివర్స్ కౌంటర్ వేయడం ..ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం లాంటివి చేస్తుందట. దీంతో సంవత్సరాలు దాటిపోతున్న సరే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవడంతో తమన్నా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!