శ్రీదేవి – రజనీకాంత్ మధ్య ఉన్న ఈ చిన్నోడు … ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా హీరో.. ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలు ఎలా ట్రెండ్ అవుతూన్న్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫొటోస్ బడా సెలబ్రెటీస్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా ఇప్పటి స్టార్ హీరో ఫొటోస్ అభిమానులు బాగా వెతికి వెతికి ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.

ఓ పక్కన శ్రీదేవి మరో పక్కన రజనీకాంత్ మధ్యలో చాలా క్యూట్ గా ఉన్న ఈ బాబు ఇప్పుడు పాన్ ఇండియా హీరో . ఒక్క సినిమాతో వెయ్యి కోట్లను కొల్లగొట్టే సత్తా ఉన్నా దమ్మున్న హీరో అని చెప్పాలి. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఓకే నేనే చెప్పేస్తాను . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్ . 1986లో రజనీకాంత్ నటించిన “భగవాన్ దాదా” చిత్రంలో హృతిక్ రోషన్ బాల నటుడిగా కనిపించాడు .

ఈ సినిమాకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరించారు . ఇందులో రజనీకాంత్ తో పాటు దివంగత నటి శ్రీదేవి కూడా నటించారు. హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో రాకేష్ దర్శకత్వం వహించిన “కహో నా ప్యారే” చిత్రంతో బాలీవుడ్లోకి హీరోగా అడుగు పెట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఒక్క సినిమాలో ఆయన నటిస్తే వెయ్యి కోట్లు కొల్లగొడుతుంది ఆ సినిమా అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . 49 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్ నెస్ తో.. స్టైలిష్ లుక్స్ తో అమ్మాయిలను కట్టిపడేస్తున్నాడు..!!