నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ డెవిల్ ‘ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన‌ మూవీ డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సబ్‌ టైటిల్ తో స్పై థ్రిలర్‌గా రాబోతున్న ఈ సినిమా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందింది. ఇక డిసెంబర్ 29న ప్రేక్షకులు ముందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో కూడా సందడి చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు సంబంధించి నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా డెవిల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం అనౌన్స్ చేసింది. మరోవైపు ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ డెవిల్ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా ర‌న్ టైం కూడా చాలా తక్కువ. 2 గంటలు 40 నిమిషాలు న‌డివితో ఈ సినిమా రిలీజ్ కానుంది. పిరియాడికల్ స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మాయ చేసి మెల్లగా, దూరమే తీరమై, ది లేడీ రోజ్‌ సాంగ్స్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ ఏడాది అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా అంత సక్సెస్ కాకపోవడంతో ఎలాగైనా డెవిల్ సినిమాతో హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడు. పైగా ఈ సినిమాలో కంటెంట్ కూడా బాగా ఉండటంతో.. సలార్ పోటీగా ఉన్నా.. రిలీజ్ డేట్ ను పోస్ట్‌పోన్ చేయకుండా డిసెంబర్ 29 నే ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఏదో కంటెంట్ ఉండే ఉంటుంది అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.