‘ సలార్ ‘ ఒక చెత్త సినిమా.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

స్టార్ యాక్టర్ పాయల్‌ ఘోష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత ఊహించిన రేంజ్‌లో టాలీవుడ్ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెకేసిన ఈ బ్యూటీ అక్కడ సినిమా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ యాక్టర్ గా పాపులారిటీ దక్కించుకుంది. అయితే సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ బ్యూటీగానే ఈ అమ్మడు పాపులర్ అయింది.

గతంలో డైరెక్టర్ అనురాగ్‌ కాస్య‌ప్‌ తనను వేధించాడు అంటూ సంచలన కామెంట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత కూడా వీలు కుదిరినప్పుడల్లా ఎవరో ఒకరిపై ఇలా లైంగిక వేధింపులు చేశారంటూ ట్విట్‌లు చేస్తూనే ఉంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పాయల్ ఘోష్.. నిన్న ఆదివారం కావడంతో ఫ్యాన్స్ తో చిన్న చిట్ చాట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా సలార్ ఓ చెత్త సినిమా అంటూ సెన్సేషనల్ ట్విట్ చేసింది. ఈ ఏడాది వచ్చిన సినిమాలు ఏవి నాకు నచ్చలేదని ఈ సలార్‌, ఢంకీ కూడా చెత్త సినిమాలు అంటూ రాసుకొచ్చింది. అయితే ప్రభాస్ నటించిన సలార్‌ రిలీజై బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న నేపథ్యంలో ఈమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. ఈమె మాట్లాడుతూ సలార్ సినిమా స్టోరీ బాగోకపోయినా.. బాగానే రన్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్, పవర్ ఫుల్ మ్యాన్.. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో పాటే జవాన్, పఠాన్ సినిమాలు కూడా ఆమెకు నచ్చలేదని.. జనాలని పిచ్చోళ్లను చేయడానికి ఇలాంటి సినిమాలు రూపొందిస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఎన్టీఆర్ జెంటిల్మెన్ కదా అని ఓ నెటిజ‌న్ అడగగా అవును ఆయనకు ఆడవాళ్ళను గౌరవించడం బాగా తెలుసు.. నాకు ఇంకా గుర్తుంది థాయిలాండ్‌లో షూట్ జరిగేటప్పుడు రోడ్డుపై నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అది చూసి తారక్ నాపై కోప్పడ్డాడు. సౌత్ పీపుల్ కు ఆడవాళ్లను గౌరవించడం బాగా తెలుసు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై ఘాటుగా స్పందిస్తున్నారు.