ఓటిటిలో వచ్చేస్తున్న ” హాయ్ నాన్న ” .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

2023 హీరో నానికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని రెండు సినిమాలతోనూ హిట్ కొట్టి, కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఏడది మొదట్లో వచ్చిన దసరా సినిమా మంచి సక్సెస్ అందుకోవడం తో పాటు నాని కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది. నిన్న మొన్నటి వరకు ల‌వర్ బాయ్‌గా కనిపించిన నాని ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో నానికి జోడిగా మహానటి కీర్తి సురేష్ నటించింది. ఇక తాజాగా నాని నటించిన హాయ్ నాన్న సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎమోషనల్ డ్రామాగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. కొత్త డైరెక్టర్ శౌర్య‌వ్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా లో తండ్రి కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ కంటెంట్ హైలెట్గా నిలిచింది. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు భారీ కలెక్షన్లను కల్లగొట్టిన నాని ముఖ్యంగా యూఎస్ లో మంచి గ్రాస్ వ‌సూళ్ళ‌ను దక్కించుకున్నాడు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడుతుందా.. ఎప్పుడెప్పుడు చూడాలా అంటూ చాలామంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ టైం వచ్చేసింది. హాయ్ నాన్న ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. జనవరి 12 అంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సినిమాలు రిలీజై సందడి చేయబోతున్నాయి. అలాగే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీలో హాయ్ నాన్న‌ సందడి చేయడానికి రెడీ అవ్వబోతుందట.