ఆ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయితే బాల‌య్యకు వ‌రుస‌గా నాలుగో బ్లాక్ బాస్ట‌ర్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో చిరుకి హిట్ ఇచ్చిన బాబీ కి బాలయ్య అవకాశమిచ్చాడు. బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాటా మొదటిసారి బాలయ్య – బాబి కాంబినేషన్లో సినిమా రూపొందుతుంది.

తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పాటతో బాలయ్య, త‌మ‌న్న‌ కలిసి చిందేయబోతున్నారట. ఈ వార్త నిజమేనంటూ.. బాలకృష్ణ సినిమాకు కూడా బాబీ తన బలమైన సెంటిమెంట్‌ను వాడుతున్నాడు అంటూ సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో బాబి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా ఊర్వసి రౌతులతో ఓ సాంగ్ రూపొందించాడు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో కూడా తమన్నతో ఐటమ్ సాంగ్ చేయించాడు. ఇప్పుడు అదే తమన్నతో మళ్ళీ NBK109లో స్పెషల్ సాంగ్ చేయించాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడట. ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ ఊటీలో పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ కోసం మూవీ టీం రాజస్థాన్ చేరుకున్నారు. 1980 స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫార్చున్ ఫ‌ర్ సినిమా, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల‌లో నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విద్యమైన కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకొని.. మే లో ఎలాగైనా సినిమాలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య తో త్రిష, ఊర్వశి రౌతెల‌ ఇద్దరు నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా బాలయ్య 109వ‌ సినిమాకు కూడా బాబీ ఐటమ్ సాంగ్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాలయ్య ఖాతాలో నాలుగవ బ్లాక్ బస్టర్ పడడం పక్కా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.