ఆ ఏరియాలో సలారోడిని దెబ్బతీస్తున్న డంకీ గాడు… పాపం ప్రభాస్…!

ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ ” అంతర్జాతీయ మార్కెట్లో భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికాలోని ప్రీమియర్ల నుంచి ఈ మూవీ 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక మొత్తం ఓవర్సీస్ నుంచి యాక్షన్ డ్రామా వరకు మొదటిరోజు 6 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయలు.

ఇక సలార్ తో పోలిస్తే ఓవర్సీస్ లో 2.8 మిలియన్ డాలర్ల క్రేజ్ లో డంకీ తక్కువ ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక ప్రస్తుతం డంకీ మూవీ ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో సలార్ను డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్లలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ కంటే ‌డంకీ ముందుంది.

ఇక నార్త్ అమెరికాలో డంకీ ఈరోజు నుంచి డామినేట్ చేయడం ప్రారంభించింది. అతి త్వరలోనే సలార్ ను క్రాస్ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు…” మా డార్లింగ్ కి ఇన్నేళ్ల తర్వాత ఒక హిట్ వచ్చింది అనుకున్నాం. ఈ సినిమా మరో రేంజ్కి వెళ్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ డంకీ డామినేట్ చేస్తుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.