రవితేజ ” ఈగిల్ ” మూవీ సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్… ఇక మొదలెడదామా..!

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు రవితేజ. ఇక తాజాగా రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఈగిల్ “.

సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి నెలలో రిలీజ్ కానున్న ఈ మూవీపై.. రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సీక్వెల్ పై మేకర్స్ ఓ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సీక్వెల్ ను డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దావ్ జాంద్ సంగీతం అందిస్తున్నారు.