బాలయ్య ” అఖండ 2 ” పై డైరెక్టర్ బోయపాటి కసరత్తులు…!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” అఖండ ” ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బోయపాటి ఈ మూవీకి సీక్వెల్ గా ష‌ అఖండ 2 ” ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? లాంటి విషయాలపై ఇంకా క్లారిటీ లేదు.

ఇక బోయపాటి శ్రీను.. అఖండ 2 స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బోయపాటి స్క్రిప్ట్ పూర్తి చేశాడని.. ప్రస్తుతం మాటల రచయిత ఎం రత్నం డైలాగ్స్ రాస్తున్నారని తెలుస్తుంది. జనవరి కి పూర్తి స్క్రిప్ట్ ఫినిష్ చేసి అనంతరం సినిమాని స్టార్ట్ చేయనున్నాడట బోయపాటి.

ఇక ఈ కథలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయిని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉండనుందని.. బాలయ్య నుంచి మరో న్యూ సినిమా రాబోతున్నట్లు టాక్. ఇక బోయపాటి వర్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో హైలెట్ కానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నాడట.