ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. గ్రాండ్ న్యూ ఇయర్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న ” దేవరా ” టీం..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇటీవల మరో రేర్ రికార్డును సొంతం చేసుకుని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కొర‌టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు.

First look of Devara : The Tribune India

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మినహా.. అప్డేట్స్ ఏవి బయటకు రాలేదు. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం మేకర్స్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయిందట.

Saif Ali Khan's first look as Bhaira from Devara is out : Bollywood News -  Bollywood Hungama

దీంతో జనవరి 1న అంటే న్యూ ఇయర్ కు ఈ సినిమాకు సంబంధించిన కొత్త న్యూ లుక్ పోస్టర్‌తో పాటు అదే వారాంతరంలోనే టీజర్‌ని కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక యువ సుధా ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. 2024 ఏప్రిల్‌లో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.