హేమ భర్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా… ఏంటి ఈయ‌న‌ అలాంటి పనులు చేస్తాడా…!

నటి హేమ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 1967 వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు లో జన్మించింది. చిన్న వయసు నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే హేమా చాలా సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది.

ఈమె ఒక్క తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్ భాషలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా ఈమె ఎన్నో అవార్డులు, రివార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి ఇంట్లో వారికి చెప్పకుండా వివాహం చేసుకుంది. అతి చిన్న వయసులోనే వివాహం చేసుకున్నందుకు తన కుటుంబ సభ్యులు చాలా కోప్పడ్డారని హేమ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

ఇక వివాహం అనంతరం తన భర్త ప్రోత్సాహంతోనే సినిమాలలో కంటిన్యూ అయ్యిందట. ఇక ఇప్పుడు వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఆమె పేరు ఈషా. ఈ అమ్మాయి కూడా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గకుండా మంచి హైట్, పర్సనాలిటీ, అందంతో కుందనపు బొమ్మ లా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈశా తన చదువుని కంప్లీట్ చేస్తుంది. చదువు పూర్తయిన అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.