నాన్న బయోపిక్ కి ఆ స్టార్ హీరో అయితేనే న్యాయం చేయగలడు.. నాగ సుశీల కామెంట్స్ వైరల్..

లెజెండ్రి యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ గురించి ఇప్పటివరకు ఎటువంటి టాపిక్ బయటకు రాలేదు. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ రామానాయుడు దర్శకత్వంలో దాసరి నారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణ ఇలా కొంతమంది జీవిత కథలు తెర‌కెక్కించే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే అక్కినేని బయోపిక్ పై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అంశం బయటకు రాలేదు. రామాయణం రామానాయుడు కథలో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని.. అలాగే దాసరి బయోపిక్ లో పేరు ఉన్న యాక్టర్, కృష్ణ జీవిత గాధలో కొడుకు మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయాలు హీరోల దాకా వెళ్లడం వాటికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పడం కూడా అయిపోయింది.

Real reason behind ANR's death?

కానీ ఏఎన్ఆర్ బయోపిక్ విషయం మాత్రం ఇప్పటివరకు అసలు చర్చకే రాలేదు. తాజాగా ఈ అంశంపై ఏఎన్నార్ కూతురు నాగ సుశీల స్పందించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన సుశీల మాట్లాడుతూ పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదని అమ్మ చెప్పేది.. అయితే మేము పుట్టి మాకు ఊహ తెలిసిన తర్వాత అయితే ఆయన కోపంగా ఎప్పుడు మేం చూడలేదు.. ఎప్పుడు సరదాగా ఉంటూ సందడి చేసే వాళ్ళు. నాన్నగారు సినిమాల షూటింగ్ కు వేసవి సెలవుల్లో వెళ్లే వాళం. అప్పట్లో ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి.. నాన్నగారు సినిమాలు చాలా వరకు నేను పూర్తిగా చూడలేదు ఎందుకంటే తెరపై ఆయన్ని ఎవరైనా కొడుతూ కొడితే చూడలేకపోయే దాన్ని అంటూ వివ‌రించింది.

నేనైతే గిఫ్ట్‌ కోసం కట్టను.. | Akkineni Nagarjuna Sister Naga Susheela  Raksha Bandhan Story - Sakshi

బయట కూడా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోను.. అనారోగ్య కారణాల వల్ల అమ్మ వేటి పైన కూడా పెద్దగా శ్రద్ధ చూపించేది కాదు.. ఇప్పుడు ఎందుకులే అంటూ అన్నిటిని పక్కన పెట్టేసేది.. దీంతో నాన్న నాతోనే చెప్పించి ఒప్పించేవాళ్లు.. ఇక మాకంటే కూడా మనవళ్ళతో ఆయన ఎక్కువగా స్పెండ్ చేసేవాడు. ఇక నాన్న బయోపిక్ గురించి మాట్లాడాలంటే ఒకవేళ బయోపిక్ తీస్తే పాత్రకి నాగార్జున అయితే చాలా బాగుంటుంది.. తను మాత్రమే నాన్న పాత్రకి న్యాయం చేయగలడు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే నాగార్జునకు ఎన్నో సినిమాల చేసిన అనుభవం ఉంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.. అలాగే నాన్నను దగ్గర నుంచి చూసి పెరిగిన వ్యక్తిగా అతను ఈ పాత్రకు సరిపోతాడు అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.