సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్టేటస్ దక్కించుకోవడం కాదు ఆ తర్వాత ఫ్లాప్స్ నుంచి బయటపడుతూ హిట్లను తమ ఖాతాలో వేసుకోవాలి అప్పుడే రియల్ హీరోగా ఇండస్ట్రీలో ఉండగలడు. అయితే అలాంటి లక్షణాలు మన ఎన్టీఆర్ కి పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు జనాలు . గతంలో ఎన్నో ఫ్లాప్ సినిమాలను ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు నుండి ఎన్టీఆర్ సునాయాసంగా తప్పించుకున్నాడు . వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా .
సినిమా ఇండస్ట్రీలో నిజాయితిగా పాపులారిటీ సంపాదించుకున్న వక్కంతం వంశీ ఆ తర్వాత డైరెక్టర్గా మారిపోయి సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాను డైరెక్టర్ చేశాడు. పెద్ద హిట్ కాకపోయినా ఎంటర్టైనింగ్ పరంగా అభిమానులను ఆకట్టుకుంది . అయితే గతంలో ఆయన తెరకెక్కించిన “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” అనే సినిమా ఫ్లాప్ అయింది .
నిజానికి ఈ సినిమాను మొదటగా తారక్ కు వివరించారట వక్కంతం వంశి . ఆ కథ వినగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పేసారట . కొన్ని సీన్స్ మారిస్తే చేస్తాను అంటూ హామీ ఇచ్చారట . కానీ వక్కంత వంశీ ఆ ధైర్యం చేయలేకపోయాడు . ఆ తర్వాత ఈ కథను బన్నీకి చెప్పి బన్ని తో తెరకెక్కించి ఫ్లాప్ ఆయన ఖాతాలో వేశాడు . అలాగే ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాకి సంబంధించిన కథను కూడా ముందుగా ఎన్టీఆర్ కి వివరించారట. కానీ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ వచ్చాక ఇలాంటి సినిమా చేస్తే జనాలు ఎక్కడ నెగటివ్ ఫీలింగ్స్ పెట్టుకుంటారు అన్న భయంతో రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ సినిమా నితిన్ ఖాతాలో చేరింది . అలా నితిన్ బన్నీ బుక్ అవ్వగా ఎన్టీఆర్ తెలివితో తప్పించుకున్నాడు..!!