బిగ్ బాస్ లో నాగార్జున వేసుకున్న ఈ స్వెటర్ షర్ట్ ధర ఎన్ని లక్షలో తెలుసా..? ఫ్యుజులు ఎగిరిపోతాయ్..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ మరొక వారం రోజుల్లో ఈ సీజన్ కి ఎండ్ కార్డ్ పడబోతుంది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమై ఆ తర్వాత మంచి మంచి ఫైట్స్ తో ఫుల్ రసవత్తరంగా సాగిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ ఫైవ్లోకి ఎవరు వెళ్తారు.. అనేదే కాకుండా ఈ సీజన్ విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది అభిమానుల్లో ఉత్కంఠ భరితంగా ముందుకు వెళుతుంది.

కాగా రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ధరించిన ఎల్లో కలర్ షర్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . చాలా వెరైటీగా ట్రెండీగా ఉండడంతో ఈ షర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ను వైరల్ చేస్తున్నారు . కాగా నాగార్జున ఏ షర్ట్ వేసిన బాగుంటుంది . కానీ ఈ షర్ట్ లో మరింత అందంగా కనిపిస్తున్నాడు. దీంతో అసలు దీని కాస్ట్ ఎంత అనే విషయం ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ధరించిన ఈ ఎల్లో కలర్ షర్ట్ ఖరీదు ₹2,11, 600 అంటూ తెలుస్తుంది . ఇది ఆయన ఎంతో స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారట. అంతేకాదు ఈ షర్ట్ పై అమర్దీప్ కూడా మనసుపడ్డాడు . “నాకు నచ్చింది నాకు ఇవ్వండి సార్ ” అంటూ ఓపెన్ గా అడిగేసాడు . అయితే నాగార్జున నిర్మొహమాటంగా “ముందు కూర్చో” అంటూ చెప్పేసి అతనికి షాక్ ఇచ్చారు..!!