కధ కూడా వినకుండా ఇంటి బయట నుండే .. “హాయ్ నాన్న” సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. ఈ సినిమాతో మంచి పాజిటివ్ హిట్ అందుకోవాలి అని ఎప్పటినుంచో వెయిట్ చేశాడు . నాని అనుకున్న విధంగానే కూల్ టాక్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని మాత్రం చెప్పగలం.

తెరపై ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ని చాలా క్లియర్ గా చూపించాడు డైరెక్టర్ శౌర్యవ్. అయితే ఈ కథను ముందుగా ఆయన హీరో వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట . ఆయనకి కథ వివరించడానికి ఇంటి దగ్గరికి కూడా వెళ్లారట. కానీ అప్పటికే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠితో ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో కొన్నాళ్ల పాటు ఏ కొత్త సినిమాకి కమిట్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యారట.

అందుకే కధ వినకుండానే ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ కధలో నాని నే సరిగ్గా మ్యాచ్ అయ్యాడని.. మిగతా హీరోలు ఎవ్వరు కూడా అంతగా సూట్ అయ్యిన్నట్లు కనిపించరు అని.. ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా లో శృతి హాసన్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది..!