శ్రీలీల టైం బ్యాడ్ మొదలైందిరోయ్.. ఆ బిగ్ బడా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల టైం బ్యాడ్ గా ముందుకు వెళ్తుందా..?  అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేసిన శ్రీలీల ఖాతా నుంచి ఓ బిగ్ బడా ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.

అయితే ఇది హీరో కారణంగానే క్యాన్సిల్ అయిందట . దానికి కారణం హీరో. ఆయన షెడ్యూల్ బిజీగా ఉండడంతో ముందు అనుకున్న టైం కి ఈ సినిమాను తెరకెక్కించలేము అంటూ మేకర్స్ కూడా శ్రీ లీలకు కన్ఫామ్ చేశారట.  అయితే ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కించిన సరే శ్రీ లీలా నే హీరోయిన్గా పెట్టుకుంటాము అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నా కానీ ఎక్కడో జనాలుకు దానిపై నమ్మకం లేకుండా పోతుంది.

ఆ హీరో బిజీబిజీగా ముందుకు వెళుతున్న క్రమంలో శ్రీ లీల అతని కోసం కాల్ షీట్స్  వెయిట్ చేసి పెట్టుకోవాలా ..? అసలకే శ్రీలీల కాల్ షీట్స్ దొరకడం కష్టం అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  మొత్తానికి శ్రీలీల కు బాగానే దిష్టి తగిలినట్టుంది . అందుకే తన ఖాతా నుంచి బిగ్ బడా ప్రాజెక్ట్ ఇలా క్యాన్సిల్ అయిపోయింది అంటున్నారు కొంతమంది జనాలు..!!