అనుష్క శెట్టికి అలాంటి రోల్ చేయాలని ఉందా..? ప్రభాస్ చచ్చిన ఒప్పుకోడు..!

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరమే లేదు. టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రీసెంట్ గానే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించిన మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఎక్కువ గ్యాప్ వచ్చిన సరే తన అందాల విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అభిమానులను బాగా అలరించింది అనుష్క శెట్టి.

అయితే అనుష్క శెట్టి కి ఎప్పటినుంచో కోరిక ఉండిపోయిందట . ఆమె విలన్ రోల్ లో నటించాలి అని .. విలన్ రోల్ లో నటించే సైకో పాత్రలో ఆమె కనిపించాలని చాలా కోరికగా ఉందట. ఇదే విషయం ఎంతో మంది డైరెక్టర్స్ కు చెప్పిన లేడీ సైకో క్యారెక్టర్స్ ను జనాలు ఎంకరేజ్ చేయరని ..అలాంటి సినిమా కథను రాయడమే మానేశారట.

అంతేకాదు ప్రభాస్ కి కూడా సరదాగా తనలోని కోరికను చెప్పిందట . కానీ ప్రభాస్ అలాంటి క్యారెక్టర్ నువ్వు చేస్తే అస్సలు బాగోదు ..వద్దనే వద్దు అని రిజెక్ట్ చేసేసాడట . అయితే ఆమె కోరిక ఇప్పటివరకు తీరనేలేదు . అలాంటి స్టోరీ ఎవరు అమ్మ వద్దకు తీసుకొని రానేలేదు . చూద్దాం మరి అనుష్క శెట్టి కోరిక సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా నెరవేరుతుందో లేదో..?