విడాకుల‌పై ప్ర‌శ్న.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ తో రిపోర్టర్ నోరు మూయించిన క‌ల‌ర్స్ స్వాతి!

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ క‌ల‌ర్స్ స్వాతి గురించి గ‌త కొంత కాలంగా ఓ న్యూస్ బాగా వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న భర్త‌కు విడాకులు ఇచ్చేసింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2018లో స్వాతి వికాస్ వాసు అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. వికాస్ వాసు వృత్తిరీత్యా పైలట్. వివాహం అనంతరం భ‌ర్త‌తో స్వాతి విదేశాల్లో సెటిల్ అయింది.

అయితే కొద్ది నెల‌ల నుంచి స్వాతి హైద‌రాబాద్ లోనే ఉంటుంది. అలాగే కెరీర్ పై మ‌ళ్లీ ఫోక‌స్ పెట్టి.. సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది. ఇదే త‌రుణంలో ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలన్నీ స్వాతి డిలీట్ చేసింది. దీంతో భర్తతో స్వాతికి విబేధాలు త‌లెత్తాయ‌ని.. ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. తాజాగా ఓ రిపోర్ట్ ఇదే విష‌యంపై ప్ర‌శ్నించాడు. ప్ర‌స్తుతం స్వాతి `మంత్ ఆఫ్ మధు` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది.

ఇందులో న‌వీన్ చంద్ర‌, స్వాతి జంట‌గా న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా చిత్ర టీమ్ హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌గా.. స్వాతి కూడా పాల్గొంది. అయితే ఓ రిపోర్ట‌ర్ `మీకు విడాకులు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వండి` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు స్వాతి `నేను చెప్ప‌ను` అంటూ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ తో స‌ద‌రు రిపోర్ట‌ర్ నోరు మూయించింది. `నటిగా తనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఒక రూల్ ఏంటంటే.. నేను చెప్పను. సంబం. ఈ కార్యక్రమానికి మీరు అడిగిన‌ ప్రశ్నకు సంబంధం లేదు. అనవసరం అని నా అభిప్రాయం. అందుకే నేను సమాధానం చెప్పను` అంటూ స్వాతి పేర్కొంది. దీంతో ఆమె వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.