తెలుగులో తిడితే బూతులు…. ఇంగ్లీషులో తిడితే నీతులా….. గీతూ ప్రశ్నలకు బిక్క మొఖం వేసేసిన దామిని…..!!

మధుర గాత్రంతో పాటల రూపంలో ఎప్పుడు వినిపించే దామిని బిగ్ బాస్ షో ద్వారా కనిపించింది. ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే ఎప్పుడు కిచెన్ లోనే వంట చేస్తూ వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఆటల్లో వెనుకబడింది. ఫలితంగా మూడో వారానికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఆమె బిగ్ బాస్ బజ్ షోలో పాల్గొంది. గీతు రాయల్ అడిగే సూటి ప్రశ్నలకు బిక్క మొఖం వేసింది దామిని.

ప్రిన్స్ యావర్ ముఖాన, నోటిలో పేడ కొట్టిన టాస్క్ ను గుర్తుచేసింది గీతు. పేడ కొట్టి ఒక మనిషికి ఊపిరాడకుండా చెయ్యొచ్చు అనుకున్నారా? అని అడగ్గా అది కేవలం ఒక టాస్క్ మాత్రమే.. తానేమైనా సీరియల్ కిల్లర్ల కనిపిస్తున్నానా? అని అడిగింది. తన ఇంగ్లీషులో మాట్లాడిన బూతులను సైతం ప్రస్తావించింది గీతు. మీ దృష్టిలో తెలుగులో మాట్లాడితే బూతులు.. ఇంగ్లీషులో మాట్లాడితే నీతులా అనడంతో ధామినికి ఏం సమాధానం చెప్పాలో తెలియక గుడ్లు తేలేసింది.

తర్వాత కంటిస్టెంట్ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని గీతు అడగగా.. రతిక అన్ని సగం సగం వింటుందని, శుభశ్రీ రెడీ అవ్వడం మీద దృష్టి పెట్టడమే కాకుండా పని కూడా చేస్తే బాగుంటుందని పేర్కొంది. ప్రిన్స్ ఇతరులను కాస్త అర్థం చేసుకోవాలని, తేజ వెటకారం తగ్గించుకోవాలంది. శోభా శెట్టి చెంచా తేజ అని, గౌతమ్ తనకే అన్ని తెలుసనుకుంటాడుంది. శివాజీ ది కన్నింగ్ గేమ్ అని, ప్రశాంత్ గురించి మాట్లాడడమే వేస్ట్ అంది దామిని. మొత్తానికి హౌస్ లో తనే తోపు అనుకున్న దామినికి బిగ్ బాస్ బజ్ లో గట్టి కౌంటర్లు పడ్డాయి.